కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసులలో ఒకరు అయినటువంటి మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా కాలం క్రితం నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా అనేక సినిమాలలో నటించాడు. ఈయన నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలు కూడా సాధించడంతో నటుడిగా ఈయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన నటించిన చాలా సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ రావడంతో ఈయన కెరియర్ గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది. అలా వరుస అపజాలతో డీలా పడిపోయిన సమయంలో ఈయన కన్నప్ప అనే ఓ భారీ బడ్జెట్ సినిమాను మొదలు పెట్టాడు.

సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ సినిమాలో ఎంతో మంది ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటీ నటులు నటిస్తున్నారు. ఇకపోతే కన్నప్ప సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న సమయంలో మంచు విష్ణు ఒక కేస్ విషయంలో సుప్రీం కోర్టు ను ఆశ్రయించాడు. అసలు విషయం లోకి వెళితే ... 2019 వ సంవత్సరం మంచు విష్ణు , వై సీ పీ పార్టీకి ఫేవరబుల్ గా పని చేశాడు. ఆ పార్టీ కోసం ప్రచారాలు కూడా చేశాడు.

2019 వ సంవత్సరం ఎన్నికలకు ముందు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి కి విరుద్ధంగా ఉన్నాయి అని , అలాగే ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ కి కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ ఆయన మీద కేసు నమోదు అయ్యింది. ఇక చాలా కాలం పాటు ఈ కేసు కొనసాగుతోంది. ఇకపోతే ఈ కేసు నిమిత్తం తాజాగా మంచు విష్ణు ఏకంగా సుప్రీం కోర్టు ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరి సుప్రీం కోర్టు లో మంచు విష్ణు కు ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: