టాలీవుడ్ లో అనగనగా సినిమాతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నాడు అక్కినేని హీరో సుమంత్ .. రీసెంట్ గానే ఈటీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయ‌న‌ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది .. ఇక ఈ సినిమాలో సుమంత్ , కాజల్ చౌదరి ముఖ్యపాత్రలో నటించగా .. పిల్లల చదువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత గురించి ఈ సినిమాల్లో ఎంతో చక్కగా చూపించారు .. అందుకే చాలామంది నుంచి ఈ సినిమా గొప్ప ప్రశంసలు అందుకుంటుంది .. ఇక ఇప్పుడు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు అనగనగా సినిమాను చూసి ప్రశంసలు వర్షం కురిపించారు .. ఎన్నో సున్నితమైన అంశాలు హృదయాన్ని అత్తుకునే విధంగా చూపించారంటూ చిత్ర బంధాన్ని అభినందించారు ..


అయితే 19990 లలో హీరోగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు సుమంత్ .. 25 సంవత్సరాల కెరియర్ లో సుమారు 30కు పైగా సినిమాల్లో నటించారు .. అయితే వాటిలో చాలావరకు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమాలు .. అయితే ఇప్పుడు అలా వాటిలో తరుణ్ నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీలో సుమన్ హీరోగా నటించాల్సి ఉందట.. 2000 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా బడ్జెట్ కేవలం కోటి రూపాయలు .. అయితే ఏకంగా 20 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .. ఈ సినిమాతోనే తన కెరీర్ లో తొలిసారి తరుణ్ బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నాడు ... అలాగే ఆ రోజుల్లో యువత ఈ సినిమాకు ఎంతగానో ఫిదా అయ్యారు చాలా థియేటర్లో ఈ మూవీ 250 రోజులకు ఆడింది .. ఒకవేళ ఈ సినిమాలో సుమంత్ నటించి ఉంటే ఆయన కెరియర్ మరోలా ఉండేదేమో అని కూడా అంటూ ఉంటారు ..


ఇప్పటికీ కూడా సుమంత్ పలు సందర్భాల్లో ఈ సినిమా గురించి చెబుతూ ఉంటారు .. ఇక ఇప్పుడు అనగనగా సినిమా ప్రమోషన్ లో కూడా మరోసారి ఈ విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు .. నువ్వే కావాలి సినిమా ఆఫర్ నాకు వచ్చింది .. కానీ అది నేను చేతులారా వదులుకున్నాను .. అందుకు నేను ఇప్పటికి ఎంతగానో ఫీల్ అవుతున్నాను .. నా కెరియర్ మొత్తం లో నా వద్దకు వచ్చి చేయలేకపోయిన సినిమా మాత్రం నువ్వే కావాలి .. ఇక నా కెరియర్ మొదట్లోనే స్రవంతి కిషోర్ గారు నువ్వే కావాలి మూవీ ఆఫర్ నాకు ఇచ్చారు .. కానీ ఆ సమయంలో డేట్స్ కుదరక ఆ సినిమాలో నటించలేకపోయా .. ఆ సమయంలో రాఘవేందర్రావు సినిమాతో పాటు యువకుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను .. అలా నువ్వే కావాలి  లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను చేతులారా వదులుకున్నాను అంటూ సుమంత్ మరోసారి గుర్తు చేసుకున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: