టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ కాంబోలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఆ అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఈ మూవీ బృందం విడుదల చేసిన వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమా అనౌన్స్మెంట్ ను విడుదల చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అర్థం అవుతుంది.

ఈ సినిమాలో ఏకంగా బన్నీ కి జోడిగా ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు , అందులో ఎక్కువగా శాతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఉండబోతున్నట్లు ఆ నటీమణులు వీరే అంటూ అనేక మంది పేర్లు అవుతూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ల సంఖ్య విషయం లోనే కాదు ఈ మూవీ కి మేకర్స్ పరిశీలిస్తున్న టైటిల్స్ విషయంలో కూడా వార్తలు భారీగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... గత కొన్ని రోజులుగా ఈ మూవీ కి ఐకాన్ అనే టైటిల్ను మేకర్స్ అనుకుంటున్నట్లు , ఆల్మోస్ట్ ఇదే టైటిల్ను ఈ మూవీ కి పెట్టే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

మూవీ బృందం వారు ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్తో పాటు సూపర్ హీరో అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు , ఈ రెండు టైటిల్స్ లలో ఏదో ఒక దానిని ఫైనల్ చేసి మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాకు ఐకాన్ లేదా సూపర్ హీరో టైటిల్ లలో ఏదో ఒక దానిని ఫిక్స్ చేస్తారా ..? లేక మరో కొత్త టైటిల్ను దేనినైనా ఈ మూవీ కి ఓకే చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: