
ఒకటి కాదు రెండు కాదు ఆమె కి ఆ మూవీ తరువాత ఆఫర్స్ చాలా వచ్చాయి. తన ఖాతాలో మంచి హిట్స్ కూడా వేసుకుంది . మరీ ముఖ్యంగా చాలా సినిమాలు హిట్ అవ్వడం కూడా ఆమెకి బిగ్ ప్లస్ గా మారిపోయింది . కాగా ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రష్మిక మందన్నా మరొక సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది . ఆ మూవీ మరేంటో కాదు "స్పిరిట్". ప్రభాస్ హీరో గా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో తృప్తి హీరోయిన్గా సెలెక్ట్ అయింది .
అయితే మరొక ఫిమేల్ లీడ్ కోసం రష్మిక మందనాన్ని సందీప్ రెడ్డివంగా చూస్ చేసుకున్నాడు అంటూ ఓ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక మందన్నాతో ఆల్రెడీ యానిమల్ సినిమాతో వర్క్ చేశారు సందీప్. అనిమల్ సీక్వెల్ మూవీలో కూడా రష్మిక మందనానే హీరోయిన్ అంటూ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది . అయితే ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ఆమె మరో ఫిమేల్ లీడ్ లో కనిపించబోతుంది అన్న వార్త హాట్ హాట్ గా ట్రెంద్ అవుతుంది . అనిమల్ సినిమాలో రష్మిక మందన్నా - తృప్తి ఇద్దరు కలిసి నటించారు . ఇప్పుడు స్పిరిట్ సినిమాలో కూడా మళ్లీ రష్మిక - తృప్తి కలిసే నటించబోతున్నారని తెలియడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ ఏది చేసిన సరే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో టైమింగ్ తో చేస్తాడు అని .. ఇక నో డౌట్ రష్మిక ఖాతాలో మరో హిట్ పడినట్లే అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . మరికొందరు పుష్ప కి అమ్మ మొగుడు లాంటి మూవీ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!