ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో క్రేజీ క్రేజీ కాంబోలు  సెట్ చేయడం చాలా చాలా టఫ్  జాబ్ అయిపోతుంది.  ఒకే హీరోయిన్ ఒకే హీరో పదేపదే సినిమాలలో కలిసి నటిస్తూ ఉంటే ఆ సినిమా చూస్తే జనాలకు బోర్ కొట్టేస్తుంది.  మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా.. ఏ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయినా సరే అందులో రష్మిక మందన్నానే  హీరోయిన్గా సెట్ చేసుకుంటున్నారు డైరెక్టర్లు . ఈ క్రమంలోనే ఆ పద్ధతిని యూ టర్న్ తీసుకుంటూ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రుక్మిణి వసంత్ ని హీరోయిన్గా చూస్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.


దీంతో అందరూ ఇప్పుడు రుక్మిణి వసంత్ పైనే పడ్డారు . ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసింది అంటే కచ్చితంగా అమ్మడులు అంతో ఇంతో టాలెంటెడ్ అయ్యి ఉంటుంది . ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.  ఈ మూమెంట్ లోనే రుక్మిణి వసంత్ కు ఆఫర్లు బ్యాక్ టు బ్యాక్ క్యు కడుతున్నాయి.  ఇప్పుడు రుక్మిణి వసంత్  ఖాతాలో మరో బిగ్ బంపర్ ఆఫర్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది . త్వరలోనే సెట్స్ పై కి రాకపోతున్న సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట .



నిజానికి ఈ రోల్ కోసం చాలామంది బ్యూటీస్ ని అనుకున్నారట సుకుమార్.  కానీ ఆయన అనుకున్న న్యాచురాలిటీకి తగిన విధంగా ఉండే అమ్మాయి రుక్మిణి వసంత్ అని రుక్మిణి వసంత్ అయితే ఈ పాత్రకు బాగా న్యాయం చేస్తుంది అన్న నమ్మకంతోనే ఆమెను ఈ క్యారెక్టర్ కి ఒప్పుకున్నారట . రామ్ చరణ్ కూడా రుక్మిణి వసంత్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాలో  ఆల్మోస్ట్ ఆల్ ఆమె ఫైనలైజ్ అయిపోయినట్లు తెలుస్తుంది . రుక్మిణి వసంత్  కుందనపు బొమ్మ అంటూ కన్నడ ఇండస్ట్రీ పిలుచుకుంటూ ఉంటుంది . అలాంటి పర్ఫెక్ట్ బ్యూటీని రామ్ చరణ్ కోసం సుకుమార్ సెట్ చేయడం నిజంగానే గ్రేట్ అంటున్నారు అభిమానులు.  చూడాలి మరి వీళ్ళ కాంబో ఎలా ఉంటుందో ..? కాగా ప్రెసెంట్ పెద్ది సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.  అంతే కాదు ఈ సినిమా ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ది  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: