కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈయన కొంత కాలం క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ సేతుపతి ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... ఫాహాధ్ ఫజిల్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. సూర్య ఈ సినిమాలో ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కూలీ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు. ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా విషయంలో లోకేష్ కనకరాజ్ "విక్రమ్" సినిమా ఫార్ములా ను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరో గా నటిస్తే అనేక సినిమాల్లో హీరోగా నటించి అద్భుతమైన ఈమేజ్ కలిగిన విజయ్ సేతుపతి ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే కూలీ సినిమాలో రజనీ కాంత్ హీరో గా నటిస్తే హీరో గా అద్భుతమైన ఈమేజ్ కలిగిన నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా లోకేష్ కనకరాజు "కూలీ" సినిమా విషయంలో విక్రమ్ మూవీ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి నిజం గానే కూలీ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపిస్తాడా లేక వేరే ఏదైనా పాత్రలో కనిపిస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: