
అదేవిధంగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు గాను గద్దర్ అవార్డు గెలుచుకున్నాడు . సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . చాలామంది స్టార్స్ అల్లు అర్జున్ స్పెషల్ గా విష్ చేస్తున్నారు . అదేవిధంగా ఉత్తమ నటిగా నివేద థామస్ సెలెక్ట్ అయ్యింది. 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమాకి గాను ఉత్తమ నటిగా నివేద థామస్ అవార్డు అందుకోబోతుంది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ నివేద థామస్ పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే నిజానికి ఉత్తమ నటిగా ఈ స్థానంలో రష్మిక మందన్నా ఉంటుంది అంటూ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు . పుష్ప 2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా రష్మిక మందన్నా ఆ ప్లేస్ల్లో ఉంటారు అని జనాలు బాగా ఎక్స్పెక్ట్ చేశారు.
కానీ ఎవరు ఊహించిన విధంగా రష్మికని వెనక్కినట్టు నివేద థామస్ ఆ ప్లేస్ లోకి వచ్చేసింది. అయితే కొంతమంది దీనిని పాజిటివ్ గానే మాట్లాడుతుంటే ..మరి కొంతమంది మాత్రం రష్మికని నెగిటివ్గా ట్రీట్ చేస్తున్నారు . రష్మిక పరువు మొత్తం పోయింది పుష్ప2 సినిమా అంత పెద్ద హిట్ అయినందుకు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు . ఉత్తమ నటిగా నివేద థామస్ సెలెక్ట్ అవ్వడం ..ఆమె ఇంతకుముందు సినిమాలకు దూరంగా ఉంటూ ఈ సినిమా ద్వారా మళ్ళీ రిఎంట్రీ స్టార్ట్ చేయడం ..రీఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే అవార్డు అందుకోవడం నివేద థామస్ నటన టాలెంట్ కు అందరూ ఫిదా అయిపోవడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక రష్మిక ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రష్మిక పరువు పోయింది అని ..పాన్ ఇండియా ఇమేజ్ ఉండి ఏం లాభం అంటూ దారుణతి దారుణంగా ఆమె పేరు ని ట్రొల్ చేస్తున్నారు. కాగా ఏ ఏ చిత్రాలకు ఏ ఏ క్యాటగిరీలో అవార్డులు వచ్చాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
గద్దర్ అవార్డుల పూర్తి జాబితా..
2024 ఉత్తమ మొదటి చిత్రం కల్కి
— 2024 రెండవ ఉత్తమ చిత్రం పొట్టేల్
— 2024 మూడవ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్
— ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ – కల్కి
— ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ – పుష్ప2
— ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ – పుష్ప2
— ఉత్తమ నటి – నివేదా థామస్ -35
— ఉత్తమ స్కీన్ ప్లే – వెంకీ అట్లూరి -లక్కీ భాస్కర్
— ఉత్తమ హాస్యనటులు – వెన్నెల కిషోర్, సత్య
— ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య -దేవర
— స్పెషల్ జ్యూరీ అవార్డు – దుల్కర్ సల్మాన్ – లక్కీ భాస్కర్
— స్పెషల్ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల – పొట్టేల్
— స్పెషల్ జ్యూరీ అవార్డు – ఫరియా అబ్దుల్లా – మత్తు వదలరా2
— ఉత్తమ బాలల చిత్రం – 35 ఇది చిన్న కథ కాదు
— రజాకార్ చిత్రానికి ఫీచర్ హెరిటేజ్ విభాగంలో అవార్డు
— ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు
— ఉత్తమ పుస్తకం – రెంటాల జయదేవ్ – మనసినిమా పుస్తకం
— ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్