డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించిన చిత్రం థగ్ లైఫ్. హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉన్నది. అలాగే కీలకమైన పాత్రలో శింబు, అభిరామి  కూడా నటించారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ట్రైలర్లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు కనబరిచాయి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్లో 70 ఏళ్ల వయసు ఉన్న కమలహాసన్ తనకంటే చిన్న వయసు కలిగిన నటితో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడంతో చాలామంది విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కమలహాసన్, నటి అభిరామి మధ్య వచ్చే సన్నివేశాలు పెను దుమారాన్ని సృష్టించాయి.


ఈ సన్నివేశం గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు వివాదాల చెలరేగడంతో తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ వేస్తోంది నటి అభిరామి. ఇప్పటికే డైరెక్టర్ మణిరత్నం కూడా ఈ విషయం పైన స్పందించారు.. తాజాగా నటి అభిరామి మాట్లాడుతూ ఈరోజుల్లో ప్రతిదీ కూడా వివాదంగానే మారుతోంది ..వాటి నుంచి తప్పించుకోలేము కమల్ కు ,నాకు మధ్య కేవలం మూడు సెకండ్లు మాత్రమే ముద్దు సన్నివేశాలు ఉన్నది.. ట్రైలర్ లో ఒక్క సెకండ్ కూడా చూపించలేదు.. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులకు అందులో ఎందుకు నటించామో అన్నది తెలుస్తుంది అంటూ కౌంటర్ వేసింది. అంతేకాకుండా తాను మనీ సార్ లాజిక్కును ఏకీభవిస్తాము.. అందుకే ఈ సన్నివేశం పైన రాద్ధాంతాన్ని పట్టించుకోలేదని తెలిపింది.



ఇకనటి అభిరామి కూడా ఇప్పటికే తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించింది. ముఖ్యంగా వేణు నటించిన చెప్పవే చిరుగాలి అనే సినిమాలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా తమిళంలోనే పలు సినిమాలలో నటించింది. ఇప్పుడు తాజాగా థగ్ లైఫ్ ముద్దు సన్నివేశంతో మరొకసారి ఈమె పేరు వైరల్ గా మారుతోంది.గతంలో కూడా కమలహాసన్ నటించిన చాలా చిత్రాలలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: