
నేనెలా ఉన్నానంటే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. అర్థం లేని కోపం తగ్గిందని కామెంట్లు చేశారు. యూట్యూబ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని నాకు కూడా చాలామంది పర్సనల్ గా మెసేజ్ చేశారని ప్రస్తుతానికి అయితే నేను దానికి సిద్ధంగా లేనని అలేఖ్య వెల్లడించారు. యూట్యూబ్ రీఎంట్రీ భవిష్యత్తులో చూద్దామని ఆమె వెల్లడించారు. బిజినెస్ అయితే ఇప్పుడు క్లోజ్ చేశామని అలేఖ్య చెప్పుకొచ్చారు.
నాకు పికిల్స్ మాత్రమే తెలుసని ఆ ఇష్యూ జరిగిన సమయంలో నా చుట్టుప్రక్కల ఉన్నవాళ్లు బాగా తిట్టారని బ్లాక్ లో పెట్టారని అలేఖ్య అన్నారు. అందరికీ లైఫ్ లో లో మూమెంట్స్ ఉంటాయని అలాంటి సమయంలో హాయ్ అని చెప్పినా ఏదోలా తీసుకుంటామని ఆమె తెలిపారు. నేను లో ఉన్న మూమెంట్ లో అలా జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. క్షమించండి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మళ్లీ బిజినెస్ గురించి ఆలోచించలేదని నేను సింగిల్ అని ఆమె పేర్కొన్నారు.
త్వరలో యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేస్తానని అలేఖ్య అన్నారు. తప్పు నాదేనని అలేఖ్య అన్నారు. నాకు డ్యాన్స్ రాదని డ్యాన్స్ ఎప్పుడూ చేయలేదని ఆమె వెల్లడించారు. నేను సినిమాలలో యాక్ట్ చేయడం లేదని అలేఖ్య పేర్కొన్నారు. జాబ్, బిజినెస్ లలో ఏది చూసుకోవాలో ఇప్పుడు ఆలోచన లేదని పెళ్లి గురించి కూడా ఆలోచించలేనని ఆమె వెల్లడించారు. నేను ఇంకా బౌన్స్ బ్యాక్ అవ్వలేదని ఆమె కామెంట్లు చేశారు.