ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో మణిరత్నం ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఎంతో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న మణిరత్నం ఈ మధ్య కాలంలో మాత్రం అద్భుతమైన విజయాలను అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడు. తాజాగా మణిరత్నం , కమల్ హాసన్ హీరో గా త్రిష హీరోయిన్గా శింబు ప్రధాన పాత్రలో థగ్ లైఫ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని జూన్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారలను ఈ మూవీ బృందం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది.

ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే మణిరత్నం తన తదుపరి మూవీ ని శింబు తో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే మణిరత్నం , శింబు కాంబోలో మూవీ కూడా ఓకే అయినట్లు తెలుస్తుంది. దానితో మణిరత్నం , శింబు తో చేయబోయే సినిమాలో హీరోయిన్ ను కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మణిరత్నం , శింబు తో చేయబోయే సినిమాలో రుక్మిణి వసంత్ ను శింబు హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అని మణిరత్నం డిసైడ్ అయినట్లు , అందులో భాగంగా ఆమెతో సంప్రదింపులు జరపగా ఆమె కూడా ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే మణిరత్నం , శింబు హీరోగా రుక్మిణి వాసంతి హీరోయిన్గా ఓ రొమాంటిక్ డ్రామాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. రుక్మిణి వసంత్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: