తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన నటుడిగా చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టాడు. ఎన్నో సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే తేజ సజ్జ ఇప్పటికే సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టేశాడు. అందులో భాగంగా కొన్ని సినిమాల్లో హీరోగా నటించి అద్భుతమైన విజయాలను కూడా అందుకొని హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తేజ సజ్జ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ తో , ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 5.54 మిలియన్ వ్యూస్ ... 158.6 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే చిన్న హీరోలలో మీరాయ్ మూవీ కి దక్కిన రెస్పాన్స్ అద్భుతం అని , ఇలాగే ఈ మూవీ పై అంచనాలు పెరిగినట్లు అయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: