ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీల మధ్య వార్ మళ్ళీ పిక్స్ కి చేరుకున్నట్లు తెలుస్తుంది . ఎప్పుడు మొదలైంది..? ఎలా మొదలైంది..? ఎలా కంటిన్యూ అవుతుంది..? ఈ ఫ్యామిలీ మధ్య వార్ అన్నదాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదు అంటూ బన్నీపై మెగా ఫ్యాన్స్ ఓ  రేంజ్ లో మండిపడ్డారు . దానికి తగ్గట్టే పుష్ప2 సినిమా విషయంలో కొన్ని కొన్ని నెగటివ్గా కూడా మారిపోయాయి.  అప్పటినుంచి బన్నీకి మెగా ఫ్యామిలీకి అస్సలు పడడం లేదు .
 

 మెగా ఫ్యామిలీ కూడా బనీను దూరం పెట్టేసింది . అయితే బన్ని  దానికి ఏమాత్రం ఫీల్ అవ్వకుండా తన పని తాను చేసుకునిపోతున్నాడు.  తెలంగాణ ప్రభుత్వం "గద్దర్" అవార్డులను ప్రకటించింది . ఈ అవార్డులను ప్రకటించిన  తర్వాత హీరో అందుకు ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకి గాను గద్దర్ అవార్డు బన్నీకి వరించింది. దీంతో సోషల్ మీడియా వ్యాప్తంగా బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది. పలువురు ఆయనకు స్పెషల్గా విషెస్ కూడా అందిస్తున్నారు . అయితే ఇంత పెద్ద అవార్డ్ అందుకుంటున్న బన్నీకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ విషెస్ చెప్పకపోవడం సంచలనంగా మారింది.



ఇంకేముంది సోషల్ మీడియాలో మళ్లీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలైంది . అయితే ఇదే మూమెంట్ లో రామ్ చరణ్ - ఉపాసన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఎంతో ప్రేమగా అత్తమ్మ కిచెన్ నుంచి ఆవకాయ పచ్చడి చేసి పంపడం...ఆ పిక్స్ సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత హిట్ పెంచేసింది . బన్నీని వదులుకొని సందీప్ రెడ్డివంగాను దగ్గర చేర్చుకుంటున్నారా..? అంటూ కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు దరిద్ర అంటే ఇదే బన్నీని దూరం చేసుకుంటే మెగా ఫ్యామిలీకే బొక్క అంటూ రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి ఈ మెగా వర్సెస్ అల్లు  ఫ్యామిలీల వార్  ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు అంటూ  జనాలు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: