ఇక మన టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోకు ప్లాప్‌ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ తో ఆ డైరెక్టర్ సినిమా చేస్తే హిట్‌ కొట్టడం ఎన్టీఆర్ కి అలవాటు అని గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో జరుగుతూ వస్తుంది .. ఇక ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ లో కూడా అలాంటి ఆలోచన ఉన్నట్టు ఉంది .. కావాలంటే మీరే చూడండి వరుసగా ఆయన సినిమాలు ఇలాంటి కాంబినేషన్లతోనే వస్తున్నాయి .. అయితే ఎన్టీఆర్ లా వరుణ్ కి సక్సెస్ లు రావడం లేదు .. ఈ విషయం పక్కనపెడితే వరుణ్ తేజ్ రాబోయే సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది .


ఇక ఇప్పుడు ఇదే రూట్ లో మరో సినిమా కథను ఓకే చేస్తున్నట్టు తెలుస్తుంది .. వరుణ్ తేజ్ ఈ రీసెంట్ టైంలో సరైన హిట్టు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు .. ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి .. ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఇప్పుడు తన జోనర్ మార్చి మేర్లపాక గాంధీ డైరెక్షన్లో హారర్ కామెడీ సినిమా చేస్తున్నాడు .. అలాగే ఈ సినిమాకు కొరియన్ కనకరాజు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు . ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మరో దర్శకుడికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది .  రవితేజతో టచ్ చేసి చూడు ఇలాంటి భారీ డిజాస్టర్ తీసిన విక్రమ్‌ సిరికొండ వరుణ్ తేజ్ కు రీసెంట్గా ఒక కథ చెప్పారట ..


అతను చెప్పిన పాయింట్ నచ్చడంతో డెవలప్ చేసే పనిలోపడ్డాడు విక్రమ్.. మరోసారి క్లియర్ నారేషన్ అయ్యాక అధికారిక ప్రకటన ఉంటుందని కూడా అంటున్నారు .. దీంతో ప్లాఫ్ డైరెక్టర్ ఫాంటసీ వరుణ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడని అందరూ అంటున్నారు .ఇక కొరియన్ కనకరాజుకు ముందు మర్లపాక గాంధీ లైక్ సబ్స్క్రైబ్ అనే ప్లాప్ సినిమా చేశారు .. అలాగే మట్కా సినిమాకు ముందు కరుణ కుమార్ కళాపురం , శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బోల్తాబడ్డాడు . అలాగే గాండీవ దారి అర్జున సినిమాకు ముందు ప్రవీణ్ సత్తార్‌కు ది గోస్ట్ డిజాస్టర్ గా నిలిచింది .. ఈ విధంగా సక్సెస్ డైరెక్టర్లతో సినిమా చేయాలనే ఆలోచన వరుణ్ తేజ్ కి రాకపోవడం కొంత ఆసక్తిగా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: