
ఇక ఇందులో భాగంగా హీరోయిన్గా నటిస్తున్న నిధి అగర్వాల్ కు మాత్రం ఎక్కడ మిస్ అవ్వటం లేదు .. ప్రమోషన్ పరంగా యూనిట్ కి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది .. దర్శక నిర్మాత ల ఆదేశాల మేరకు నడుచుకుంటుంది .. ఇక నిధి అగర్వాల్ కు వ్యక్తిగతంగా బాగా కలిసి వస్తుంది మీడియా సమావేశాల్లో ప్రధానంగా ఆమె ఎంతగానో హైలెట్ అవుతుంది. అయితే అదే పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ఉంటే నిధి ఫోకస్ అయ్యేది కాదు .. కెమెరాలు మొత్తం పవన్ పైనే ఉండేవి .. ఆయన ఉన్నంతసేపు ఆయన మీదే మీడియా ఫోకస్ ఉంటుంది .. కానీ ఆయన లేకపోవడంతో ఆ ఫోకస్ అంతా నిధి అగర్వాల్ పై పడింది ..
ఇక ఈ క్రమంలో నిధి తన్ను తాను వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకుంటుంది .. అసలే ఈ అమ్మడికి సరైన పిఆర్ టీం కూడా లేదు . అన్ని తానై ఆమె చూసుకోవాల్సి వస్తుంది .. ఈ క్రమంలోనే అన్నీ ఉన్న .. అవకాశాలు అందుకోలేకపోవటానికి కారణం సరైన పిఆర్ లేకపోవడం కూడా అని అంటారు .. అలాగే సోషల్ మీడియాలో కూడా రేర్ గాని ఈమె ఎంతో యాక్టివ్గా ఉంటుంది .. కానీ ఇప్పుడు వీరమల్లు ప్రమోషన్ల భాగంగా నీధి అగర్వాల్ ఎక్కువగా హైలైట్ అవుతుంది .. తన వృత్తి , వ్యక్తిగతంగా కూడా తన మార్క్‌ను చూపే ప్రయత్నంలో దూసుకుపోతుంది .