టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ ఎలా తన సినిమాలలో వేరియేషన్స్ చూపిస్తున్నాడు అందరికీ తెలిసిందే.  సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన "అతడు" సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్గా మారింది . ఆ సినిమా కమర్షియల్ గా నిరాశ పరిచిన ..విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. అయితే ఆ తర్వాత వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమా ఖలేజా . "అతడు" సినిమా కమర్షియల్ గా నిరాశ పరిస్థితే.. ఖలేజా  సినిమా థియేటర్ల విషయంలో డిజాస్టర్ గా నిలిచింది . బుల్లితెరపై మాత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది .


సిల్వర్ స్క్రీన్ పై డిజాస్టర్ గా మారిన ఖలేజా మూవీ బుల్లితెరపై మాత్రం ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టేసుకుంది.  మరీ ముఖ్యంగా ఖలేజా సినిమాలోని కామెడీ సీన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి . ఆలీ - మహేష్ బాబు - అనుష్కల మధ్య వచ్చిన కామెడీ సీన్స్ ఇప్పటికీ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతూనే ఉంటాయి . అయితే "ఖలేజా" సినిమా విషయంలో త్రివిక్రమ్ తీసుకున్న ఒక డెసిషన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది . ఇక కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ కావాలి . ఈ మూమెంట్లో మహేష్ - త్రివిక్రమ్ "ఖలేజా" సినిమా టైటిల్ ఖరారు చేశారు . అయితే షూటింగ్ అంతా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన తర్వాత ఖలేజా టైటిల్ నాది అంటూ దానికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి అంటూ కోర్టును ఆశ్రయించారు పిటీషనర్.



దీంతో సినిమా విడుదలకు స్టే ఇవ్వాలి అంటూ కోర్టుకు పిటిషనర్ కోరాడు. సినిమా విడుదల సమయంలో ఈ విషయమై రిలీజ్ కి స్టే ఇవ్వడం కుదరదు అంటూ పిటిషనర్ కి న్యాయమూర్తి తెగేసి చెప్పేశాడు. అంతేకాదు మీకు జరిగిన అన్యాయం కు  నష్టపరిహారం డిమాండ్ చేయొచ్చు అంటూ సూచించగా అదే సమయంలో కోర్టుకు లంచ్ విరామం ఇవ్వడంతో .. విరామం సమయంలో నిర్మాతలు పదిలక్షలు ఇచ్చేందుకు ఓకే చెప్పారు . పిటిషనర్ కూడా సరే అన్నాడట.  కానీ తీరా  న్యాయమూర్తి 10 లక్షలు పరిహారం తీసుకోవాలి అంటూ సూచించగా పిటిషనర్ 25 లక్షలు డిమాండ్ చేశారట . దీంతో ఈ పరిహార గొడవ తీరేలా లేదు అంటూ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాల్సిందే అంటూ న్యాయమూర్తి పిటిషనర్ను మరిన్ని సాక్ష్యధారాలు తీసుకురావాల్సిందిగా సూచించారు .



అయితే అంతవరకు సినిమా విడుదలకు స్టే ఇచ్చేందుకు మాత్రం న్యాయమూర్తి అస్సలు ఒప్పుకోలేదట.  ఫైనల్లీ సినిమా విడుదలకి అంత సిద్ధం అయిపోయింది.  కానీ కోర్టులో కేసు అలాగే సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చింది . దీంతో సినిమాకు ఎటువంటి లీగల్ సమస్యలు రాకుండా తెలివిగా ఆలోచించిన త్రివిక్రమ్ "ఖలేజా" సినిమాను "మహేష్ ఖలేజా"గా మార్చేశాడు. మీరు టైటిల్ను బాగా గమనించినట్లయితే ఖలేజా కి ముందు మహేష్ అని ఖలేజా కి పైన త్రివిక్రమ్ అని చిన్నగా రాసి ఉంటారు . అలా త్రివిక్రమ్ తన తెలివితేటలతో ఖలేజా సినిమాకు లీగల్ ఇష్యూస్ రాకుండా కాపాడాడు.  ఒకసారి ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది ..!

మరింత సమాచారం తెలుసుకోండి: