టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటు డి గా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో మంచు మనోజ్ ఒకరు . ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరోగా నటించాడు . అందులో కొన్ని మూవీ లతో మం చి విజయాలను కూడా మనోజ్ సొంతం చేసుకున్నాడు . కానీ ఈయన గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నాడు . కానీ మళ్ళీ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు . తాజాగా ఈయన నటించిన భైరవం సినిమా ఈ రోజు అనగా మే 30 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ప్రస్తుతం ఈయన తేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

ఇకపోతే మంచు మనోజ్ తన కెరియర్లో చాలా సినిమాలను వదిలేసినట్లు తెలుస్తోంది. ఈయన వదిలేసిన సినిమాలలో కొన్ని అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "రచ్చ" అనే సినిమాలో హీరో గా నటించి మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

మూవీ ఆఫర్ ను మంచు మనోజ్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ ఆఫర్ ను కూడా ఈయన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీ లతో పాటు నాగ చైతన్య హీరో గా రూపొందిన ఆటోనగర్ సూర్య మూవీ ఆఫర్ ను కూడా ఈయన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూడు సినిమాలలో రచ్చ , అర్జున్ రెడ్డి సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోగా. ఆటోనగర్ సూర్య మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: