తాజాగా తమన్నా ఫోటోలు, వీడియోలు చూసినా చాలామంది ఈ మాట అనక తప్పరు. ఎందుకంటే ప్రస్తుతం ఈమె ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఇదేంటి తమన్నా ఇలా మారిపోయింది.. రీసెంట్ గానే ఓదెల-2 మూవీలో అలా సన్నగా మెరుపుతీగలా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇంతలోనే ఇంత చేంజ్ అయిపోయిందేంటి అని షాక్ అయిపోవడం ఖాయం.ఎందుకంటే తమన్నా తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో చాలా బొద్దుగా మారిపోయి కనిపించింది. ముందు పొట్ట వెనక గుట్ట అంటూ తమన్నా వీడియో కింద చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇదేంటి తమన్నా ఇంతలా మారిపోయింది అని చాలామంది ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు.

అయితే ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్లు అది తమన్నా రియల్ వీడియో కాదని, కొంతమంది కేటుగాళ్లు క్రియేట్ చేసిన ఏఐ వీడియో అని తేల్చేస్తున్నారు.ఎందుకంటే తమన్నా కటౌట్ కి ఆ వీడియోలో ఉన్న కటౌట్ కి అస్సలు సెట్ అవ్వలేదు. కచ్చితంగా ఇది ఏఐ క్రియేటెడ్ వీడియోనే అని తేల్చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరో హీరోయిన్లకు సంబంధించి ఏఐ వీడియోలు ఎక్కువైపోయాయి.ముఖ్యంగా హీరోయిన్లు బికినీలు వేసుకొని హీరోలకి లిప్ లాక్ ఇచ్చినట్టు,బీచ్ లో ఫోటోలు దిగినట్టు పెళ్లిళ్లు చేసుకున్నట్టు ఇలా ఎన్నో ఏఐ క్రియేటెడ్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే. 
అలా తాజాగా తమన్నా కి సంబంధించిన ఏఐ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసి తమన్నా ఫ్యాన్స్ అయితే ఇదేంటి ఇది మా తమన్నా నేనా అని షాక్ అయిపోతున్నారు.అంతేకాదు ఏఐ వీడియో అని తెలిసి చాలామంది తమన్నా అభిమానులు ఈ వీడియో క్రియేట్ చేసిన వాళ్లపై మండిపడుతున్నారు. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గానే ఓదెల టు మూవీతో మన ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమాకి గట్టిగానే ప్రమోషన్స్ చేసినప్పటికీ అంత హిట్ అయితే కాలేదు. ఏదో యావరేజ్ హిట్ అయింది.ఇక తమన్నా పర్సనల్ లైఫ్ చూస్తే ఆమె రీసెంట్ గానే విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పి మళ్ళీ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: