టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో భారీ విజయాలను ఎన్నింటినో అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు వరుస పెట్టి బోల్తా కొడుతూ వస్తున్నాయి. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది. ఆఖరుగా ఈయన డబల్ ఈస్మార్ట్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను అందుకుంది.

ఇకపోతే పూరీ జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి తో చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ "డబల్ ఇస్మార్ట్" మూవీ కి సంబంధించిన ఓ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... రాజమౌళి తండ్రి ప్రముఖ కథ రచయిత అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి నేనంటే చాలా ఇష్టం. ఆయన నాకు వరుస అపజయాలు వస్తూ ఉండటంతో ఒక రోజు మీరు ఏదైనా సినిమా చేసేటప్పుడు ఆ కథను నాతో ఒక్క సారి చర్చించండి. కథలో ఏమైనా లోపాలు ఉంటే నేను సలహాలు ఇస్తాను అని అన్నారు. ఆయన చాలా గొప్పవారు. అలాంటి సలహా ఇచ్చారు. కానీ నేను ఆయనను కలిసి కథ చెప్పలేకపోయాను. కానీ మంచి సినిమా మాత్రం చేశాను అని అన్నాడు. కానీ డబల్ ఇస్మార్ట్ మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతితో మూవీ స్టార్ట్ చేయనున్నాడు. అలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ , విజయేంద్ర ప్రసాద్ ను కలిసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానితో చాలా మంది డబల్ ఇస్మార్ట్ టైం లో పూరి జగన్నాథ్ , విజయేంద్ర ప్రసాద్ కి స్టోరీ చెప్పలేదు. ఈ సారి తన మూవీ స్టోరీని చెప్పినట్లు ఉన్నాడు. అందుకే అతన్ని కలిసి ఉంటాడు. ఈ సారి కచ్చితంగా పూరి జగన్నాథ్ మంచి విజయాన్ని అందుకుంటాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: