సినిమా ఇండస్ట్రీ లో అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకునే వారిలో సంగీత దర్శకులు కూడా ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఒక సినిమా మంచి విజయం సాధించాలి అంటే సంగీతం కూడా ఎంతో ముఖ్యమైన అంశంగా ఉంటుంది . ఒక సినిమాను ఎంత బాగా తీసిన దానికి మంచి సంగీతం కనుక లేనట్లయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. అదే ఆ సినిమాకు మంచి సంగీతం తోడైతే ఆ మూవీ అద్భుతమైన విజయం అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక సినిమాను రూపొందించే విషయంలో కాస్త తప్పులు జరిగినా కూడా ఆ సినిమాలో అద్భుతమైన సంగీతం ఉన్నట్లయితే ఆ మూవీ మంచి విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి.

అందుకే మంచి సంగీతం అందించే సంగీత దర్శకులకు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉంటూ ఉంటుంది. దానితో మంచి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకులకు అద్భుతమైన పారితోషకాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో అద్భుతమైన సంగీత దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో బీమ్స్ సేసేరోలియో ఒకరు. ఇప్పటివరకు ఈయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈయన సంగీతానికి కూడా ఎన్నో సినిమాల విషయంలో అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి.

దానితో ఈయన తన పారితోషకాన్ని కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా 8 కోట్ల పారితోషకం పుచ్చుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా బీమ్స్ ఒక్కో మూవీ కి 8 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు అని వార్తలు వస్తూ ఉండడంతో కొంత మంది మీడియం రేంజ్ హీరోలకు కూడా ఇంత పారితోషకం ఇస్తున్నారో ... లేదో అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: