ప్రముఖ హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి , ఎన్నో విజయాలను అందుకుని బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరో గా రూపొందిన ఆది పురుష్ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కూడా సైఫ్ ఆలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఇకపోతే ఆది పురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ద్వారా సైఫ్ ఆలీ ఖాన్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. ఇకపోతే దేవర పార్ట్ 1 సినిమాతో సైఫ్ అలీ ఖాన్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే తాజాగా సైఫ్ తన దృష్టిలో అసలైన సక్సెస్ అంటే ఏమిటి అనే దాని గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా సైఫ్ అలీవఖాన్ మాట్లాడుతూ ... తన దృష్టిలో అసలైన సక్సెస్ అంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడమే అని సైఫ్ చెప్పుకొచ్చాడు. పిల్లలకు హాలిడేస్ ఉన్న టైంలో తాను పని చేయను అని తాజాగా చెప్పుకొచ్చాడు.

పిల్లలు పడుకొని ఉన్న సమయంలో ఇంటికి వెళ్లడం తనకు ఇష్టం ఉండదు అన్నారు. మనీ , ఫేమ్ కంటే ఫ్యామిలీతో గడిపే మధుర క్షణాలే తనకంటూ ప్రత్యేకమైన తాజా ఇంటర్వ్యూలో భాగంగా సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. తాజాగా సైఫ్ ఆలీ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి వివాహ బంధం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: