టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం ఖలేజా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రకాష్ రాజు ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... బ్రహ్మానందం , కోటా శ్రీనివాసరావు , సునీల్ , అలీమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2010 వ సంవత్సరం అక్టోబర్ 7 వ తేదీన విడుదల అయింది.

కానీ ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిన ఈ సినిమాను తాజాగా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. ఇక రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. రీ రిలీజ్ లలో ఈ మూవీ అనేక కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఖలేజా మూవీ ని ఎన్ని కోట్లతో రూపొందించారు.

సినిమా మొదట విడుదల అయినప్పుడు ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం. ఖలేజా మూవీ ని దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆ సమయంలో కేవలం 18 కోట్ల కలెక్షన్లను మాత్రమే వసూలు చేసి భారీ అపజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా ప్రస్తుతం మాత్రం రీ రిలీజ్ లో భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ అద్భుతమైన రికార్డులను నెలకొల్పే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb