సందీప్ రెడ్డి వంగ ..తీసుకునే  ఒక్కొక్క డెసిషన్ "స్పిరిట్" సినిమా రేంజ్ ని  మార్చేస్తున్నాయి . మరీ ముఖ్యంగా దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి . అయితే ఆ తరువాత జరిగిన తత్తంగాలు అందరికి తెలిసిందే . దీపికా పదుకొనే రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం.. ఆమె రెమ్యూనరేషన్తో పాటు కొన్ని కండిషన్స్ పెట్టడం ..అది సందీప్ రెడ్డివంగాకు నచ్చకపోవడం తో ఆయన ఈ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పిస్తూ తృప్తి దిమ్రిని  హీరోయిన్గా సెలెక్ట్ చేశారు .


ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.  అయితే ఆ తర్వాత దీపికా పదుకొనె తన పిఆర్ టీంతో "స్పిరిట్" సినిమా స్టోరీని మొత్తం లీక్ చేసింది అంటూ బయటికి ఊ న్యూస్ రావడం .. సందీప్ రెడ్డి దానికి తగ్గట్టే ట్వీట్ పెట్టడం దానికి దీపిక పదుకొనే కౌంటర్ ఇవ్వడం.. ఆ తర్వాత అజయ్ దేవగన్ - కాజోల్ కి ఇదే ప్రశ్న ఎదురవ్వగా వాళ్ళు ఇచ్చిన సమాధానం ఎంత హిట్ పెట్టించే విధంగా మారిందో అందరికీ తెలుసు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సందీప్ రెడ్డివంగా తెరకెక్కిస్తున్న "స్పిరిట్" సినిమా మరొకసారి హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

 

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కత్తిలాంటి ఫిగర్ ని చూసి చూసుకున్నాడు సందీప్ అంటూ ఓ న్యూస్ తెర పైకి వచ్చింది . ఆమె మరెవరో కాదు "మృణాల్ ఠాకూర్". ఎస్ మృణాల్ ఠాకూర్ ని ఈ సినిమాలో ఆయన సెకండ్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారట.  నిజానికి మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ సీన్స్ లో  నటించడానికి అస్సలు ఇష్ట్పడదు.  ఆ కారణంగా ఎన్నో మంచి సినిమాలను కూడా వదులుకొనింది. మరి అలాంటిది అర్జున్ రెడ్డి - అనిమల్ సినిమాలను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఆమె నటించడానికి ఎందుకు ఓకే చేసింది..? సందీప్ ఎలా ఒప్పించాడు..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సందీప్ రెడ్డివంగా ఎలా ఆమెను ఈ సినిమాకి ఒప్పించాడు..? ఏం చెప్పి ఒప్పించాడు..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: