ఏంటి మనోజ్ కోసం విష్ణు రౌడీలను కొట్టారా.. మనోజ్ ఏమో తన అన్నయ్య అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పుకుంటూ వస్తే విష్ణు మాత్రం తమ్ముడి కోసం అంత పెద్ద త్యాగం చేశారా..ఇంతకీ అసలు విషయం ఏంటి? రౌడీలతో విష్ణు గొడవ వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. మంచు విష్ణు కి మనోజ్ కి మధ్య ప్రస్తుతం గొడవలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే గొడవలు త్వరలోనే తొలగిపోతాయి అని, అందరం త్వరలోనే హ్యాపీగా ఉంటాము అని విష్ణు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణు మాట్లాడిన ఒక వీడియో  సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏం చెప్పారంటే.. తమ్ముడు మనోజ్ శ్రీ మూవీ చేసే  షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లారు. అక్కడ భువనేశ్వర్ లోని ఓ టెంపుల్ లో ఒక ముఖ్యమైన సన్నివేశం తెరకెక్కిస్తున్నారు.

ఆ టైంలో షూటింగ్ చూడ్డానికి చాలామంది అక్కడున్న జనాలు తరలివచ్చారు.దాంతో కొంతమంది ఆకతాయిలు సినిమా షూటింగ్ కి ఆటంకం కలిగేలా గోల చేస్తూ బిగ్గరగా అరిచారు. దాంతో వారి అరుపులకి డైరెక్టర్ కాస్త డిస్టర్బ్ అయ్యి కాస్త సైలెంట్ గా ఉండండి సీన్ తీస్తున్నాను అని చెప్పారు. అయినా కూడా వాళ్ళు వినకుండా అలాగే బిగ్గరగా అరిచేసరికి డైరెక్టర్ తీసే సీన్ కి చాలా డిస్టర్బ్ అయింది. దాంతో నేను వెళ్లి కాస్త సైలెంట్ గా ఉండండి అని చెప్పాను. అయినా కూడా వాళ్ళు వినలేదు. కోపంతో అక్కడే షూటింగ్లో ఉన్న రౌడీల చేతిలోని కర్రలను తీసుకొని వారి మీదకు వెళ్లాను. దాంతో ఆ ఊరి వాళ్ళు మేము లోకల్..మీరేంటి మా మీదకు కర్రలు పట్టుకొని వస్తున్నారు.మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం అని నాకే వార్నింగ్ ఇచ్చారు.

దాంతో నేను మరింత మండిపడ్డాను. ఆ వెంటనే అక్కడి పోలీసులు వచ్చి షూటింగ్ సెట్లో అల్లరి చేసే వారందరికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించారు. అలా ఆరోజు మనోజ్ మూవీ కోసం నేను రౌడీలతో గొడవ పెట్టుకున్నాను అంటూ విష్ణు చెప్పుకొచ్చారు. అయితే మంచు విష్ణు మొదటి మూవీ శ్రీ రాజస్థాన్లోని భువనేశ్వర్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో విష్ణు అలా చేశారట. ఇక మనోజ్ ఫస్ట్ మూవీ శ్రీ లో తమన్నా హీరోయిన్ గా నటించింది. అయితే ప్రస్తుతం విష్ణు అప్పుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో సింపతి కోసమే విష్ణు ఈ వీడియోని తనే వైరల్ చేయించుకుంటున్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: