కోలీవుడ్ నటుడు ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్ గత ఏడాది విడాకులతో సపరేట్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే దాదాపు 18 సంవత్సరాల పైగా సంసార జీవితం సాగినప్పటికీ అనుకోని కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా 2022 సెప్టెంబర్ లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు లో అప్లై చేయగా వీరికి ఫ్యామిలీ కోర్టు 2024 నవంబర్ లో విడాకులు మంజూరు చేసింది. ఇక ధనుష్ ఐశ్వర్య లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కానీ ధనుష్ తన సినీ కెరియర్ లో ఎంత మంది అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నారు అనే రూమర్లు ఎక్కువగా వినిపించాయి.ముఖ్యంగా రజినీకాంత్ చాలా సార్లు ధనుష్ ని మందలించారు.అయినా కూడా తన ప్రవర్తన మార్చుకోలేదని అంటూ ఉంటారు. అలాగే చాలాసార్లు తన భర్త ప్రవర్తన చూసి విసిగిపోయిన ఐశ్వర్య రజినీకాంత్ ఇక తనతో కలిసి ఉండలేక చివరికి విడాకులు తీసుకుంది. 

అలా ఇద్దరు కొడుకులు పుట్టి కొడుకులు పెద్దవాళ్ళు అయ్యాక తన భర్తతో విడాకులు తీసుకుంది. అలా గతేడాది ఈ జంట విడాకులతో సపరేట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ధనుష్ ఐశ్వర్య లు మళ్లీ కలిసి పోయారని విడాకులు క్యాన్సిల్ చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తుంది.మరి నిజంగానే ధనుష్ ఐశ్వర్యలు విడాకులు క్యాన్సల్ చేసుకున్నారా..మళ్లీ కలిసి పోయారా అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా ధనుష్ ఐశ్వర్యల కొడుకు యాత్ర రాజా తల్లిదండ్రులను మళ్లీ కలిపాడు. ఎందుకంటే యాత్ర రాజా స్కూల్ గ్రాడ్యుయేషన్ తాజాగా పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ గ్రాడ్యుయేషన్ ఈవెంట్లో తల్లిదండ్రులుగా ధనుష్ ఐశ్వర్యలు పాల్గొనాల్సి ఉంది.

కాబట్టి కొడుకు కోసం మళ్ళీ ధనుష్ ఐశ్వర్యలు ఒక్కటయ్యారు. ఒకేచోట ఇద్దరు కలిశారు.. అలాగే కొడుకుని పట్టుకొని ఇద్దరు హగ్ చేసుకున్న ఫోటోని రజినీకాంత్ స్వయంగా షేర్ చేసి తన ముద్దుల మనవడికి విష్ చేస్తూ మొదటి మైలురాయి దాటేశావ్ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. అయితే ఈ ఫోటో చూసి చాలా మంది నెటిజన్లు ధనుష్ ఐశ్వర్యలు మళ్ళీ కలిసిపోయారని సంతోషపడతారు. కానీ వీరు మళ్ళి కలవలేదు.వీరు విడాకులు తీసుకున్నది నిజమే.అయితే కొడుకులకు సంబంధించి ఏ పనైనా సరే కలిసే చేస్తామని ముందుగానే అగ్రిమెంట్ చేసుకోవడంతో ఇలా కొడుకుల గురించి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు ధనుష్ ఐశ్వర్య..


మరింత సమాచారం తెలుసుకోండి: