ప్రస్తుతం కన్నప్ప హార్డ్ డిస్క్ వివాదం తారాస్థాయికి చేరిన సంగతి మనకు తెలిసిందే. ఇన్ని రోజులు విష్ణు వర్గం వాళ్లు మాత్రమే మనోజ్ పై ఆరోపించారు.కానీ స్వయంగా ఓ ఈవెంట్లో విష్ణు తన తమ్ముడు మనుషులే ఈ పని చేశారని,ఒకవేళ తన తమ్ముడి దగ్గర ఉంటే ఎలా పరిస్థితి.. కానీ మా నాన్న తమ్ముడి పేరు బయటికి రాకుండా చూడమన్నాడు. కానీ పేర్లు బయటికి వచ్చేసాయి. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయి అంటూ విష్ణు చెప్పారు. అయితే విష్ణు కన్నప్ప హార్డ్ డిస్క్ మనోజ్ దొంగతనం చేశారని చెప్పినా కూడా మనోజ్ ఇప్పటివరకు స్పందించలేదు.అయితే తాజాగా బైరవం మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సమయంలో ఈ విషయం గురించి మాట్లాడారు. తాజాగా భైరవం మూవీ ప్రెస్ మీట్ చెన్నైలో జరిగింది.ఆ ప్రెస్ మీట్ లో చాలామంది విలేకరులు మనోజ్ ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. 

ఇందులో భాగంగా మనోజ్ భైరవం గురించి మాట్లాడుతూ దాదాపు 9 ఏళ్ల తర్వాత భైరవం మూవీతో మళ్లీ నటుడిగా మళ్ళీ మీ ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాను. ఈ సినిమాలో నెగిటివ్  షేడ్స్ ఉన్న పాత్ర పోషించినప్పటికీ ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు..అంటూ మాట్లాడుతున్న సమయంలో కన్నప్ప హార్డ్ డిస్క్ వివాదం గురించి స్పందించమని కోరారు ఓ విలేకరి. కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉంది అని మీ అన్నయ్య అంటున్నారు నిజమేనా మీ దగ్గరే ఉందా అని ఓ విలేకరి అడగగా.. ఆ హార్డ్ డిస్క్ మీకే కదా ఇచ్చాను.. ఆరోజు  మీరే తీసుకున్నారు కదా.. ఎక్కడ పెట్టారు అంటూ అదే విలేకరిని ఫన్నీగా అడిగారు.. ఇప్పుడు నేను నా భైరవం సినిమా గురించి వచ్చాను  వేరే విషయాల గురించి మాట్లాడను. ఒకప్పుడు కన్నప్ప మూవీ గురించి ఫన్నీగా మాట్లాడుతూ ట్రోలింగ్ చేశాను. కానీ ఆ తర్వాత ఒకరి కోసం అందరిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనిపించింది.

అందులో ఎంతో మంది గొప్ప గొప్ప నటులు చేశారు.ఒకరి కోసం వారందరినీ విమర్శించకూడదు. అందుకే కన్నప్ప మూవీ పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. భైరవం మూవీ సక్సెస్ అయిన సంతోషంలో నేను ఉన్నాను. ఇలాంటి సమయంలో నన్ను రెచ్చగొట్టాలని చూడకండి. మీరు రెచ్చగొట్టినా కూడా ఇంతమంది అభిమానుల ప్రేమ ముందు నేను అన్ని మర్చిపోతాను. కన్నప్ప హార్డ్ డిస్క్ గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. అలాగే ఇదే ప్రెస్ మీట్ లో తన తండ్రి గురించి మాట్లాడారు మనోజ్. చాలామంది సినిమా చూశాక మీ తండ్రి నటనని గుర్తు చేశారని మాట్లాడుకుంటున్నారు మీ ఫీలింగ్ ఏంటి అని విలేకరి అడగగా..నా తండ్రి నుండి వచ్చిన ఆస్తి అదే.. నా డిఎన్ఏ లోనే నటన ఉంది అంటూ మనోజ్ ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు.ఇక భైరవం మూవీ విడుదలైన సమయంలో తండ్రితో పాటు ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అంటూ మనోజ్ ఓ పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: