ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల నుండి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ఇండియా వ్యాప్తంగా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న కొన్ని మూవీలకు మాత్రమే అద్భుతమైన కలెక్షన్లు రీ రిలీజ్ లో భాగంగా దక్కుతున్నాయి. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన ఇండియన్సినిమాలలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

గిల్లి : తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 32.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

సచిన్ : దళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రీ రిలీజ్ లో భాగంగా 13.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మురారి : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రీ రిలీజ్ లో బాగంగా 8.90 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

గబ్బర్ సింగ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రీ రిలీజ్ లో భాగంగా 8.01 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఖుషి : పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 7.46 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఖలేజా : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 30 వ తేదీన రీ రిలీజ్ అయింది. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజే 6.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: