కొంత మంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడానికి అత్యంత ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇష్టపడే జనాలకు కొన్ని సందర్భాలలో థియేటర్లలో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల కానట్లయితే వారు డిసప్పాయింట్ అవుతుంటారు. అలా ఎక్కువ శాతం థియేటర్కు వెళ్లి సినిమాలు చూడాలి అనుకునే ప్రేక్షకులకు మంచి క్రేజ్ ఉన్న సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి థియేటర్లలోకి వచ్చినట్లయితే వారు కూడా తెగ ఆనంద పడుతూ ఉంటారు. ఇకపోతే అలా సినిమాను థియేటర్కి వెళ్లి చూడాలి అని అనుకునే వారికి జూన్ నెల ఫుల్ ఖుషి ని పంచబోతుంది. ఈ నెల ఏకంగా మంచి క్రేజ్ ఉన్న నాలుగు సినిమాలు ధియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మరి ఆ నాలుగు సినిమాలు ఏవి ..? ఏ తేదీన విడుదల కానున్నాయి ..? అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

తాజాగా కమల్ హాసన్ "థగ్ లైఫ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. త్రిషమూవీ లో హీరోయిన్గా నటించగా ... మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శింబు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 5 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన విడుదల కానుంది. ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర మూవీ ని జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ మరి కొంత మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీనటులు నటించారు. ఇలా ఈ జూన్ నెలలో ఈ నాలుగు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: