మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమాను మొదట ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ కాస్త స్లో గా ముందుకు సాగుతూ ఉండడంతో ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే రవితేజ తన నెక్స్ట్ మూవీ కి కమిట్ అయ్యాడు. రవితేజ తన తదుపరి మూవీ ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల నుండి రవితేజ , కిషోర్ తిరుమల కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ను అత్యంత వేగంగా పూర్తి చేసి ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనలో మేకర్స్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే రవితేజ మూవీ కోసం కిషోర్ తిరుమల ఒక డిఫరెంట్ టైటిల్ను కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ , కిషోర్ తిరుమల కాంబో మూవీకి అనార్కలి అనే టైటిల్ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలకు ఎక్కువ శాతం పవర్ఫుల్ మాస్ టైటిల్స్ ఉంటూ వస్తాయి. కానీ రవితేజ , కిషోర్ తిరుమలతో చేయబోయే సినిమాకు మాత్రం మాస్ టైటిల్ కాకుండా కాస్త క్లాస్ టైటిల్ను పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దానితో రవితేజ తన రూట్ ను మార్చాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: