అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ ప్రస్తుతం తన కొత్త మూవీ లెనిన్ ను డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) .. దర్శకత్వం లో చేస్తున్నాడు .. అయితే ఇప్పుడు ఈ సినిమా పై రోజుకొక అప్డేట్ రూమర్ బ‌య‌ట‌కి వస్తూనే ఉంది .. అలాగే ఈ సినిమా కు సంబంధించిన ఎలాంటి వార్త బయటకు వచ్చినా కూడా సోషల్ మీడియా లో అది తెగ వైరల్ గా మారుతుంది .. ఈ క్రమంలోని ఈ సినిమా లో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేయనున్నారట .. కాగా ఈ స్పెషల్ సాంగ్ ను క్రేజీ హీరోయిన్ అనన్య పాండే చేత చేయించాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుందట .. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది చూడాలి ..


కాగా ఈ సినిమా .. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో రాబోతుంది .. అలాగే హీరో  అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోకి మారిపోయింది .. అలాగే ఈ సినిమా లో అఖిల్ కు జంటగా అందాల బ్యూటీ శ్రీలీల హీరోయిన్  గా నటిస్తుంది .. ఇక ఈ సినిమా యూనిట్ అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం ఈ సినిమాని ఈ ఎడాది నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు .. అలాగే అఖిల్ గ‌త‌ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి .. ప్రధానంగా అఖిల్ శ్రీలీల‌ కాంబోలో వచ్చే లవ్ సీన్స్ చాలా బాగుంటాయి అన్నట్టు టాక్ బయటకు వస్తుంది .. అఖిల్ కూడా ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు .. ఇక మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత అఖిల్ కెరియర్లో మరో భారీ హిట్గా నిలుస్తుందా లేదా చూడాలి ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: