టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా ఇటీవలే శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నది. తన సొంత బ్యానర్ లో సక్సెస్ అందుకోవడంతో చాలా హ్యాపీగా ఉంది సమంత. అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిడిమోరుతో  డేటింగ్ లో ఉన్నట్లుగా పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి.అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి అప్పుడప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇటీవలే విమానంలో కూడా రాజ్ తో సమంత చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.


దీంతో ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్స్ ఇక వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారనే విధంగా వైరల్ గా చేశారు.అయితే ఈ విషయం పైన సమంత, రాజ్ నిడిమోరు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఇలాంటి సమయంలోనే సమంత తాజాగా షేర్ చేసిన ఒక వీడియో మరొకసారి రూమర్స్ కి మరింత స్థానం కల్పించేలా కనిపిస్తోంది. హ్యాపీ వీకెండ్ అంటూ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న సమంత కొన్ని వీడియోలను ఫోటోలను కూడా షేర్ చేసింది.

అయితే ఈ వీడియోలో రాజ్ నిడిమోరుతో కలిసి సమంత పికిల్ బాల్ ఆడుతున్నట్లు కనిపించింది. అయితే కోర్టులో ఇద్దరూ కూడా చాలా ఆనందంగా పికిల్ బాల్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో మరొకసారి నేటిజన్స్ సమంత వ్యవహారం గురించి  చర్చిస్తున్నారు. శుభం సినిమా రిలీజ్ సమయానికి ముందు ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. అయితే రాజ్ నిడుమోరు భార్య మాత్రం పలు రకాల కొటేషన్స్ ను షేర్ చేస్తున్నప్పటికీ అసలు విషయం మాత్రం బయటపడలేదు.

సమంత, రాజ్  నిడిమోరు ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడేల్ వంటి వెబ్ సిరీస్లలో కలిసి పని చేశారు. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే చిత్రంలో కూడా కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: