
సితారే జమీన్ పర్ అనే సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 20న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న అమీర్ ఖాన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తు తన పర్సనల్ విషయాలను కూడా బయటపెట్టారు. రీనా దత్తాతో 1986లో వివాహం అయ్యిందని.. 2002లో విడాకులు తీసుకున్నామని.. వివాహమైన సమయంలో ఇద్దరి వయసు చిన్నది ఇదే తమ కుటుంబంలో చీలికకు కారణమయ్యిందంటూ తెలిపారు అమీర్ ఖాన్.. రీనా, నేను చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నామని.. వివాహం అయ్యేసరికి నా వయసు 21 సంవత్సరాలు ఆమె వయసు 19 సంవత్సరాలు.. కేవలం ఇద్దరి మధ్య పరిచయం 4 నెలలు మాత్రమే..
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. వివాహాల విషయంలో తగు నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు అమీర్ ఖాన్.. టీనేజ్ ఉత్సాహంలో చాలా విషయాలు అర్థం చేసుకోలేకపోయాను అంటూ తెలిపారు.. అంతేకాకుండా రీనాతో తన జీవితం చాలా హ్యాపీగా ఉండేదని ఆమె వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని తెలిపారు.. ఆమె మంచి వ్యక్తి అని కూడా తెలియజేయడం జరిగింది అమీర్ ఖాన్.. అయితే టీనేజ్ లో ఎవరు తొందరపడి వివాహం చేసుకోవద్దండి అంటే అమెరికన్ సలహా ఇస్తున్నారు. మొత్తానికి తన మొదటి భార్యతో విడాకులపై నిజం చెప్పేశారు అమీర్ ఖాన్.