ఇక టాలీవుడ్ స్టార్ బ్యూటీ స్వీటీ అనుష్క నుంచి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ “ఘాటీ” .. దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి కాంబోలో వస్తున్న ఈ సినిమా పై ఎప్పటినుంచో మంచి హైప్ క్రియేట్ అయింది .. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది .. కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ గానే మారింది .. ఇక మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఫైనల్ గా చిత్ర యూనిట్ నుంచి సాలిడ్ అప్డేట్ అయితే రెడీ చేశారు ..


ఇక రేపు జూన్ 2 మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకి ఒక భారీ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్టు గా భారీ ప్రకటన రిలీజ్ చేశారు .. ఇక మరి ఇది దాదాపు కొత్త రిలీజ్ డేట్ కి సంబంధించిందని అంటున్నారు .. ఇక‌ మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది రేపటి వరకు వేచి చూడాలి .. ఇక ఈ సినిమా లో విక్రమ్ ప్రభువు కూడా నటిస్తుండ గా .. విద్యాసాగర్ సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ వారు పాన్ ఇండియా లెవ‌ల్ ఈ సినిమా ని నిర్మించారు ..  మరి చాలా కాలం తర్వాత అనుష్క నుంచి వస్తున్న సోలో మూవీ కావటం తో ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది .. ఇక మరి అనుష్క కు ఘాటీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..



మరింత సమాచారం తెలుసుకోండి: