టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించి ఇప్పటికీ కూడా అదే రేంజ్ లో కెరియర్ను కంటిన్యూ చేస్తున్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఓ వైపు సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయిలో కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలోనే పవన్ "జనసేన" అనే ఓ రాజకీయ పార్టీని పెట్టి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పవన్ ఈ సారి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అలాగే తన జనసేన పార్టీ కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు.

పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా తన ఫోకస్ ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలపై ఉంది. గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో రాష్ట్రం ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది అని , ఆ తర్వాత దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని ఆయన భావిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా గ్రామాలు స్వయం సమృద్ధి చెందాలి అని ఆయన పిలుపునిస్తూ వస్తున్నాడు. కానీ గ్రామపంచాయతీల్లో ఎక్కువ నిధులు లేకపోవడం వల్ల ఆయన మాటలు చేతలు రూపంలోకి మారడం కష్టం అనే అభిప్రాయాలను కూడా కొంత మంది వ్యక్తం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ కోరికకు అనుగుణంగా మోదీ ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు.

అది ఏమిటి అనుకుంటున్నారా ..? దేశవ్యాప్తంగా ప్రతి  రాష్ట్రంలో కూడా పది గ్రామపంచాయతీలను ఎంచుకొని వాటిలో వ్యాపారాలు చేసుకునే అనుమతుని కల్పిస్తారు. దానితో వారు వ్యాపారాలు చేసుకొని కాస్త డబ్బులు వెనక వేసుకొని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ పథకం గనుక సక్సెస్ అయితే దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి అని బిజెపి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కోరిక మోడీ తాజాగా తీసుకువచ్చిన పథకం ద్వారా నెరవేరుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: