టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లు కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లలో విడుదలైన సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మే నెల మాత్రం టాలీవుడ్ సినిమాలకు మరీ భారీ స్థాయిలో అనుకూలించలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మే నెల బాక్సాఫీస్ రివ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
మే నెల మొదటి వారంలో నాని నటించిన హిట్3 విడుదల కాగా గురువారం రోజున విడుదలైన ఈ సినిమా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హిట్3 మూవీ ఓటీటీలో సైతం అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
మే నెల 9వ తేదీన సింగిల్, శుభం సినిమాలు రిలీజ్ కాగా సింగిల్ సినిమ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ నిలవగా శుభం సినిమా మాత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే సమంతసినిమా నాన్ థియేట్రికల్ హక్కులతో సేఫ్ అయ్యారు. అందరూ కొత్తవాళ్లు నటించడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అయింది. అదే తేదీన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ రీరిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కూడా కలెక్షన్ల విషయంలో సత్తా చాటలేదు.
 
మే నెల చివరి వారంలో భైరవం, ఖలేజా సినిమాలు రిలీజ్ కాగా భైరవం సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఖలేజా సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రీరిలీజ్ కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సత్తా చాటింది. మహేష్ ఫ్లాప్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

mat