కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో ధనుష్ ఒకరు. ఈయన తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు.

ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ కమ్ముల , ధనుష్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా శేఖర్ కమ్ముల , ధనుష్ గురించి మాట్లాడుతూ ... కుబేర సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ధనుష్ నటన అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పటికే ధనుష్ కి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. కుబేర సినిమాలోని ఆయన నటనకు మరో నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. కుబేర సినిమాలో ఆయన చేసిన పాత్రను మరే నటుడు కూడా చేయలేడు అని తాజాగా శేఖర్ కమ్ముల , ధనుష్ గురించి చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు కుబేర సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు ప్రస్తుతానికి మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk