- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి పై గ‌త‌ కొన్ని రోజులగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే .. సమంత , నాగచైతన్య విడిపోయాక ప్రస్తుతం సమంత ఒంటరి గానే జీవిస్తుంది .. అయితే సమంత రెండో పెళ్ళికి రెడీ అవుతుందని .. ఈమె తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమూరి తో ఆమె పెళ్లి చేసుకోబోతుందని కొన్ని రోజులు గా రూమర్లు వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి .. తాజాగా సమంత రాజ్ తో పికిల్ బాల్ ఆడుతూ కనిపించడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది .. ప్రస్తుతం సమంత , రాజ్ పికిల్ బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .. అలాగే ఈ వీడియో పై రాజ్ నిడుమూరు భార్య శ్యామలి కూడా ఓ భారీ పోస్ట్ పెట్టింది .. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది .. కర్మ వాటిని సరిచేస్తుంది .. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది అంటూ సోషల్ మీడియాలో రాసుకు వచ్చింది ..


అయితే ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తుంది .. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత .. సమంత రెండో పెళ్లి పై కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అందుకు అనుగుణంగానే సమంత కూడా రాజ్ నిడిమోరు తో క్లోజ్ గా ఉంటూ పెళ్లి చేసుకోబోతున్నానంటూ హింట్ ఇచ్చేస్తుంది .. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు వీరి రిలేషన్ గురించి ఎక్కడ బయటపట్టలేదు .. అయితే రాజ్‌కు ఇప్పటికే పెళ్లి అయిపోవడంతో అతను కూడా ఈ విషయంపై ఎక్కడా స్పందించడం లేదు .. అతి త్వరలోనే రాజ్‌ తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతను పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది . అలాగే దీనిపై త్వరలోనే క్లారిటీ రాబోతుందని కూడా అంటున్నారు .. ఇక మరి సమంత , రాజ్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: