డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో AA 22 సినిమా పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని రూ .800 కోట్ల బడ్జెట్ తెరకెక్కిస్తూ ఉన్నారు. పార్లర్ యూనివర్స్ జోనర్ల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ త్రిబుల్ రోల్స్ లో కనిపించబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. 2026 చివరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఈ చిత్రంలో హీరోయిన్ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఇప్పటికే 5 మంది హీరోయిన్స్ పేర్లు వినిపించగా ఇప్పుడు తాజాగా దీపికాపదుకొనే పేరు కూడా వినిపిస్తున్నది.


గతంలో సందీప్ రెడ్డి వంగ ,ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం కొన్ని కారణాల చేత కోల్పోయింది. ముఖ్యంగా 20 కోట్ల రెమ్యూనరేషన్, సినిమా లాభాలలో 15% షేర్ డిమాండ్ చేసిందనే విధంగా వార్తలు వినిపించాయి.. ఈ డిమాండ్స్ వల్లే ఈమెను డైరెక్టర్ తిరస్కరించారని సమాచారం. ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమా దీపికాకు మరొక వరంగా మారింది. ఇప్పటికే ఇందులో జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్స్ నటిస్తూ ఉన్నారు.


అయితే ఇంతమంది హీరోయిన్స్ నటిస్తూ ఉన్న తాను నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. కేవలం స్పిరిట్  సినిమా మీద కోపంతోనే ఒక భారీ ప్రాజెక్టులో భాగం కావాలని ఎదురు  చూస్తున్న సమయంలో అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చిందని.. సినిమాకు కోసం రెమ్యూనరేషన్ కూడా తగ్గిందని ఎలాంటి షేర్స్ కూడా అడగలేదని.. వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రెమ్యూనరేషన్  విషయంలో ఎందుకు తగ్గింది అనే విషయంపై అభిమానుల ఆసక్తి మొదలయ్యింది.. దీపికా డిమాండ్స్ కి అట్లి ఓకే చెప్పారేమో, డేట్లు కూడా తక్కువగా ఇచ్చిందేమో అనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది.. మరి కొంతమంది మాత్రం స్పిరిట్ తో మొదలైన నెగెటివిటీ పోగొట్టుకోవడానికి ఇలా బడా ప్రాజెక్టులను చేస్తోంది అన్నట్లుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి AA 22 చిత్రానికి దీపికానే తగ్గిందా.. తగ్గించారా అనే విషయం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: