కోలీవుడ్ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందులలోకి గురయ్యేలా చేశాయి. కన్నడ భాష పైన చేసిన ఈ వ్యాఖ్యలతో కమలహాసన్ పైన కన్నడికులు చాలా ఫైర్ అవుతున్నారు. ఆయన సినిమా థగ్ లైఫ్ ను ఆడనివ్వమంటూ బ్యాన్ చేశారు. ఈ విషయంపై కమలహాసన్ కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ కూడా కోర్టు కూడా క్షమాపణలు చెప్పాల్సిందే అన్నట్లుగా తెలియజేసింది. అయినా కూడా కమలహాసన్ వెనక్కి తగ్గలేదు. దీంతో ఒక్క క్షమాపణ విలువ రూ .12 కోట్ల రూపాయలు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


కమలహాసన్ కేవలం తన వ్యాఖ్యలనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెబుతూ ఉన్నారు కానీ ఒక్క క్షమాపణ చెప్పలేదు.. కోర్టు అడిగిన సరే తగ్గకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అయితే తన సినిమాని అవసరమైతే కర్ణాటకలో రిలీజ్ చేయకుండా ఉంటాను అంటూ తగిన నిర్ణయం తీసుకోవడంతో అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. కానీ కన్నడికులు మాత్రం కమలహాసన్ క్షమాపణలు చెబితే ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ చేస్తామంటూ చెప్పడమే కాకుండా అటు  కన్నడ ఫిలిం ఛాంబర్ కూడా తేల్చి చెప్పింది.


థగ్ లైఫ్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కర్ణాటక హైకోర్టులో కూడా ఫిలిం ఛాంబర్ ఫిటిషన్ వేసింది. దీంతో కోర్టు క్షమాపణలు  చెబితే సరిపోతుంది కదా అంటూ కమల్ హాసన్ కి సూచించిన తను మాత్రం క్షమాపణ చెప్పను కన్నడలో సినిమాను కూడా రిలీజ్ చేయననే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.దీనివల్ల 12 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతోంది. కన్నడలో కూడా కమలహాసన్ కి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది..కన్నడ సినీ ఇండస్ట్రీ కూడా పెద్ద మార్కెట్ అలాంటిది చేజేతులారా కమలహాసన్ రిస్కు చేస్తున్నారని పలువురు అభిమానులు భావిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల తర్వాత కన్నడలోని భారీ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. కమలహాసన్ చేస్తున్న పని వల్ల నిర్మాతలకు నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది.  ఈ విషయంపై కమలహాసన్ వెనక్కి తగ్గుతారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: