
సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా సినిమా అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ కానుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జాక్ నష్టాలకు సంబంధించి సెటిల్ చేసే దిశగా ఈ హీరో అడుగులు వేస్తున్నారని తన పారితోషికంలో 4 కోట్ల రూపాయలు వెనక్కు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఒక హీరో ఇంత మొత్తం వెనక్కు ఇవ్వడం కూడా సాధారణ విషయం కాదనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో సిద్ధు జొన్నలగడ్డను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ఈ దిశగా అడుగులు వేయడం శుభ పరిణామం అనే చెప్పాలి. డబ్బులు వెనక్కు ఇవ్వకుండా ఉండి ఉంటే నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ పై ఊహించని స్థాయిలో భారం పడేది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు 5 సినిమాలు నిర్మిస్తే ఒకటో రెండో హిట్టవుతున్నాయి. ఫ్లాప్ సినిమాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన నిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. టైర్1 పాన్ ఇండియా డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డకు సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరుగుతోంది.