బాలీవుడ్ నటి అయినటువంటి సోనాలి బింద్రే సౌత్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది.అలా సోనాలి బింద్రే తెలుగులో మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మధుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అలా సోనాలి బింద్రే తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. చాలా రోజులు క్యాన్సర్ తో పోరాడి చివరికి క్యాన్సర్ నుండి బయటపడింది.ఇక క్యాన్సర్ నుండి బయటపడి ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఏంట్రి ఇవ్వాలని చూస్తోంది.అలా పలు షోలకి కూడా సోనాలి బింద్రే వస్తూ పోతూ మళ్ళీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అని చూస్తుంది. 

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఆ హీరో నన్ను చాలా వేధించారని,ఆయన వల్ల నేను చాలా టార్చర్ అనుభవించడమే కాకుండా ఆయన నన్ను గడ్డి పోచలా తీసిపారేసేవారంటూ మాట్లాడింది. మరి ఇంతకీ సోనాలి బింద్రే ఈ మాటలన్నీ చెప్పింది ఎవరి గురించయ్యా అంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. సోనాలి బింద్రే సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో హమ్ సాత్ సాత్ హై అనే ఒక మూవీ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లో  సోనాలి బింద్రే సల్మాన్ ఖాన్ ని చాలా చీప్ గా చూసారట.ముఖ్యంగా అందరినీ ఒకలా తనని ఒకలా చూసేవారట.

అలా చీమలాగే తనని తీసిపారేసే వారని చీమను ఎలా చూసేవారో తనని కూడా అలాగే చూసేవారని సోనాలి బింద్రే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.అయితే రోజులు గడుస్తున్నా కొద్ది సోనాలి బింద్రేకి సల్మాన్ ఖాన్ నిజస్వరూపం ఎలాంటిదో బయటపడిందట. అంతేకాదు సల్మాన్ ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని బాధపడిందట.ఎందుకంటే సల్మాన్ ఖాన్ బయటికి కనిపించేంత కఠినాత్ముడు కాదని ఆయన లోపల చాలా సాఫ్ట్ మంచివాడని దయా హృదయుడని తెలుసుకొని ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో ఫ్రెండ్లీగా ఉందట. అలా ఎవరిని కూడా ఫస్ట్ చూడడంతోనే జడ్జ్ చేయకూడదని,ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో కొద్ది రోజులు గడిస్తే గానీ చెప్పలేం అంటూ సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: