నాచురల్ స్టార్ నాని తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య తాజాగా రెట్రో అనే మూవీ లో హీరో గా నటించాడు. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా మే 1 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయింది.

కానీ ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలం అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాల యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.  అందులో భాగంగా గత కొన్ని రోజులుగా ఈ రెండు మూవీ లను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఇకపోతే ఈ వారంలో నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి 4.2 మిలియన్ వ్యూస్ దక్కగా , రెట్రో మూవీ కి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో వారం రోజుల్లో 2.5 మిలియన్ వ్యూస్ మాత్రమే దక్కాయి.

ఇలా ఒకే రోజు విడుదల అయిన ఈ రెండు సినిమాలు ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వారం రోజుల్లో ఈ రెండు మూవీలలో హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అద్భుతమైన రెస్పాన్స్ దక్కగా , రెట్రో మూవీ కి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ మాత్రమే దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: