
బాహుబలి తర్వాత కేజిఎఫ్ ఆ తర్వాత పుష్ప.. ఆ తర్వాత సల్లార్..ఆ తరవాత దేవర ..ఆ తరువాత కల్కి..ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సినిమాలు రెండు భాగాలు స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ బాహుబలి హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు ఆయన నెక్స్ట్ సినిమా "స్పిరిట్" కోసం అంటూ ఫిలిం సర్కిల్స్ లో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమా పేరు "స్పిరిట్". ఈ సినిమాలో తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుంది . స్పిరిట్ సినిమా ఇష్యూ ఈ మధ్యకాలంలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు . అయితే ఈ సినిమాను సందీప్ రెడ్డి రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట . ఒకే మూవీలో రెండున్నర మూడు గంటల లోపు ఆయన అనుకున్న స్టోరీ జనాలకి అర్థం అయ్యేలా చేయడం చాలా చాలా టఫ్ అవుతుంది అని.. రెండు భాగాలుగా తెరకెక్కిస్తే అసలు సినిమా స్టోరీ ఏంటి ..? అనేది ఈజీగా ఉంటుంది అని సందీప్ రెడ్డివంగా ఈ డెసిషన్ తీసుకున్నారట. అంతేకాదు ప్రభాస్ కూడా దానికి ఓకే చేసి కాల్ షీట్స్ ఎక్స్ట్రాగా ఇచ్చేసారట. దీంతో బాహుబలి హిట్ సెంటిమెంట్ ని స్పిరిట్ సినిమాకి రిపీట్ చేస్తున్నాడు ప్రభాస్ అని అంత మాట్లాడుకుంటున్నారు. కచ్చితంగా ఈ సినిమా ఆయన కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!