
ఆ సమస్యలు తీరితే మాత్రమే ఈ సినిమా అనుకున్న తేదీకి అనుకున్న విధంగా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. హరిహర వీరమల్లు నిర్మాత ఆ అప్పులు క్లియర్ చేయాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ సినిమా పలుమార్లు వాయిదా పడటంతో ప్రైమ్ సంస్థ 5 కోట్ల రూపాయల మేర కోత విధించింది. మరోవైపు ఈ సినిమాకు కొత్త డేట్ ను ప్రకటించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం.
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటే బెటర్ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏఎం రత్నం హరిహర వీరమల్లు ముందు ఉన్న అన్ని సవాళ్లను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి. క్రిష్ ఈ సినిమా నుంచి డైరెక్టర్ గా తప్పుకోవడం కూడా ఈ సినిమా నయా కష్టాలకు కారణమైందని చెప్పవచ్చు. వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంటే ఈ పరిస్థితి మారుతుంది.
హరిహర వీరమల్లు మూవీ బడ్జెట్ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువని నిర్మాత చెప్పుకొచ్చారు. హరిహర వీరమల్లు మూవీ కమర్షియల్ రేంజ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరమల్లు మూవీ కమర్షియల్ రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది.