పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కొన్ని సార్లు ఆగిపోతూ వచ్చింది. దానితో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను జ్యోతి కృష్ణ అనే దర్శకుడు పూర్తి చేశాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. అందులో మొదటి భాగాన్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ వారు ప్రకటించారు.

కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ఈ మూవీ జూన్ 12 వ తేదీన విడుదల కావడం కష్టం అని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ జూన్ 12 వ తేదీన కనుక ఈ సినిమా విడుదల కాకపోయినట్లయితే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను విడుదల చేయడానికి మరో మూడు తేదీలను అనుకుంటున్నట్లు , ఆ మూడు తేదీల్లో ఏదో ఒక తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ బృందం వారు జూన్ 12 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడం కుదరనట్లయితే జూన్ 27 వ తేదీన లేదా జూలై 4 వ తేదీన లేదా జూలై 11 వ తేదీల్లో ఏదో ఒక తేదీన ఈ సినిమాను విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నీది అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ ఏం రత్నం ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: