బాలీవుడ్ స్టార్ హీరోలు చూపు ఇప్పుడు సౌత్ దర్శకుల మీద పడింది .. ఇప్పటికే బాలీవుడ్ ను ఒక ఊపు ఊపి వదిలిపెట్టాడు దర్శకుడు అట్లీ .. ఇక ఇప్పుడు మరో దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్‌ వంతు వచ్చింది .. ఈ దర్శకుడు బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు అది కూడా స్టార్ హీరో అమీర్ ఖాన్ తో .. అమీర్ ఖాన్ , లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్లో ఓ మూవీ ఫిక్స్ అయింది ఈ సినిమాలో అమీర్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు . వచ్చే సంవత్సరం ద్వితీయద్దంలో ఈ సినిమా షూటింగ్ కు వెళ్లనుంది . ఈ సినిమా చేయకుండానే మరికొన్ని కొత్త ప్రాజెక్టులు లాక్ చేస్తున్నాడు అమీర్ ఖాన్ .. సితారే జమీన్ పర్ తర్వాత అమీర్ చేయబోయే సినిమా ఇదే ..

అయితే ప్రస్తుతం లోకేష్ బిజీగా ఉండటం కారణంగా ఈ ప్రాజెక్టు షూటింగ్ కి వెళ్ళడానికి మరింత సమయం పడుతుంది .. ఈ ఏళ్ల కెరియర్ లో అమీర్ చేస్తున్న తొలి సూపర్ హీరో సినిమా కూడా ఇదే .. ఇక ఇందులో హాలీవుడ్ రేంజ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఉండబోతున్నాయని అంటున్నారు .. అయితే ప్రెసెంట్ అమీర్ పీకే సినిమాకు సీక్వెల్ చేస్తారని ప్రచారం కూడా ఉంది .. అయితే ఇలాంటి వార్తల్ని అమీర్ ఖండించారు తన మైండ్లో అసలు పీకే 2 లేదని కూడా క్లారిటీ ఇచ్చేశాడు .. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మాత్రం చేస్తాను అంటున్నాడు .. వీటితో పాటు మహాభారతం తన చివరి చిత్రమని కూడా ప్రకటించేసాడు అమీర్ .. ఇక అది ఎప్పటికీ మొదలవుతుంతో తనకి కూడా తెలీదని ఒకవేళ మహాభారతం చేస్తే మాత్రం అదే తనకు లాస్ట్ సినిమా అవుతుందని కూడా ప్రకటించాడు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: