ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ పేరే మారుమ్రోగిపోతుంది . దానికి కారణం పెద్ది సినిమా . మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అనే విషయం సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన పనిలేదు . అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ నెగిటివ్ విషయం బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కమల్ హాసన్ ధగ్ లైఫ్ మీద రామచరణ్ అభిమానులు ముందు నుంచే కన్నేసారు. ఎందుకంటే దీనికి సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ . పెద్దికి స్వరకర్త కూడా ఏఆర్ రెహమాన్ .


కమల్ మూవీకి బెస్ట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా నిశ్చింతగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఉండేవాళ్లు మెగా అభిమానులు. కానీ ధగ్ లైఫ్ మ్యూజిక్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే . సినిమాపై  మ్యూజిక్ బాగా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తెనాలి లాంటి సూపర్ ఆల్బమ్స్ ఇచ్చిన రెహమాన్ ఇప్పుడు అదే మ్యాజిక్ చేయాలని ఆశించడంలో తప్పులేదు. కానీ రెహమాన్ మ్యూజిక్ మాత్రం అభిమానులను  ఆకట్టుకోవడం లేదు. మణిరత్నం అంతటి లెజెండరీ రెహమాన్ నుంచి బెస్ట్ రాబెట్టుకోలేకపోతే నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ ఏం రాబట్టుకుంటాడు ..? అనేది ఇప్పుడు బిగ్ డౌట్..?



పెద్ది సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నెగిటివ్ గా మారిపోతుంది ఏమో అంటూ భయపడిపోతున్నారు మెగా అభిమానులు.  పెద్ది టీజర్ ఆ భయాన్ని కొంతమేర పోగొట్టిన ..చిన్న వీడియోనే కాబట్టి ఎక్కువగా హోప్స్ పెట్టుకోలేము . బుచ్చిబాబు ఈ విషయంపై మరొకసారి సీరియస్ గా ఆలోచిస్తే బాగుంటుంది అంటున్నారు మెగా అభిమానులు. మెగా అభిమానులకు ఈ టెన్షన్ తీరాలి అంటే పెద్దిసినిమా రిలీజ్ డేట్ వరకు ఆగాల్సిందే . వచ్చే ఏడాది మార్చి 27వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఈ సినిమా తెలుస్తుంది . ఈ విలేజ్ డ్రామాకు సంబంధించి షూటింగ్ 40% కంప్లీట్ అయ్యింది. బుచ్చి బాబు రెహమాన్ దగ్గర్ బాగా  వర్క్ చేయించుకొని అదరగొట్టే రేంజ్ లో మ్యూజిక్ రాబట్టుకుంటే మాత్రం సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. లేకపోతే లేనట్టే. మెగా అభిమానులకు ఇది ఒక టెన్షన్ లా మారిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: