మంచు విష్ణు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాంట్రవర్సీ కామెంట్సస్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. అయితే ఎన్నిసార్లు వివాదాల్లో ఇరుక్కున్నా కూడా బుద్ధి రాదు అన్నట్లుగా మళ్లీ మళ్లీ వివాదాల్లో ఇరుక్కుంటూ సినిమాకి పబ్లిసిటీ చేసుకుంటున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్,ప్రభాస్ అభిమానులకు తెగ కోపం తెప్పిస్తున్నాయి.నా సినిమా ముందు పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు నిలబడలేవు.. అవి కూడా వేస్టే అన్నట్లుగా విష్ణు మాట్లాడి అభిమానుల కోపానికి బలయ్యారు. మరి ఇంతకీ విష్ణు ఎందులో పవన్ ప్రభాస్ కించపరిచారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్ కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీ సినిమా బడ్జెట్ ఎంత చెప్పగలరా అని అడగగా.. ఇప్పుడు నా సినిమా బడ్జెట్ ఎంతో చెబితే ఐటి రైడ్స్ జరుగుతాయి. 

అయితే నాకేమీ భయం లేదు.. అన్ని లెక్కలు కరెక్ట్ గానే చెబుతాను.కానీ ఈ ఐటి రైడ్స్ కారణంగా మా చిత్ర యూనిట్ ఇబ్బంది పడుతుంది. లేనిపోని ప్రశ్నలు అడిగి వాళ్ళు ఇబ్బంది పెడతారు. అందుకే ఇప్పుడు బడ్జెట్ చెప్పాలనుకోవడం లేదు. కానీ బడ్జెట్ మూడు అంకెల్లోనే ఉంటుంది అని చెప్పాడు. మూడంకెలు అంటే 200,300,400 ఇలా మీరు చెప్పిన అంకెల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఎన్ని కోట్లు పెట్టారో చెప్పండి అని యాంకర్ అడిగింది.అయినా కూడా మంచు విష్ణు నిజం చెప్పలేదు.ఆ తర్వాత ప్రభాస్ రాజా సాబ్ కంటే ఎక్కువ బడ్జెటా అని అడగగా.. అవును రాజా సాబ్ కంటే ఎక్కువ బడ్జెటే అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓజికి పెట్టినంత బడ్జెట్ పెట్టారా అని యాంకర్ అడగగా..ఏంటి ఓజీకి అంత ఎక్కువ బడ్జెట్ పెట్టారా అని షాకింగ్ ఫేస్ పెడుతూ విష్ణు అడిగారు.

ఇక విష్ణు అడిగిన ప్రశ్నకి యాంకర్ అవును దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అంటూ యాంకర్ చెప్పారు.అయితే యాంకర్ మాటలకు అలా అయితే 200 కోట్ల కంటే ఎక్కువగానే మా సినిమా బడ్జెట్ అంటూ మంచు విష్ణు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలను విష్ణు కించపరిచారని ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో విష్ణు పై ట్రోలింగ్ చేస్తున్నారు.అంతేకాదు మా హీరోల సినిమాలు నీ సినిమా ముందు తక్కువా అని అంటున్నావు.. బడ్జెట్ మాత్రమే పెట్టావు కానీ దానికి కలెక్షన్లు కూడా రావాలి కదా.. నువ్వు ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా సినిమా బాలేక పోతే కలెక్షన్లు రావడం కష్టం.మా హీరోల సినిమాలకు తక్కువ బడ్జెట్ పెట్టినా ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. వాళ్ల ముందు నువ్వు ఎంత అంటూ ప్రభాస్ పవన్ కళ్యాణ్ అభిమానులు మంచు విష్ణుని ట్రోల్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: