మణిరత్నం గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది. ఆయనకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు.ఎందుకంటే అంత పెద్ద దిగ్గజ డైరెక్టర్ పై ఇలాంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం అనేది నిజంగా కొంతమంది బుద్ధి తక్కువ వాళ్ళు చేసిన పని.. ఎందుకంటే సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ చాలా మంది మణిరత్నం అభిమానులకి హర్టింగ్ గా ఉంది.. ఈ పోస్ట్ చూసి దిగ్గజ డైరెక్టర్ పై ఇలాంటి దిక్కుమాలిన పోస్ట్ చేస్తారా అంటూ మణిరత్నం అభిమానులు ఫైర్ అవుతున్నారు.మరి ఇంతకీ మణిరత్నం అభిమానులు అంతగా తిట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చూస్తే.. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ మూవీ లో  కమల్ హాసన్, శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మి వంటి స్టార్ సెలబ్రెటీలు నటించిన సంగతి మనకు తెలిసిందే.

 ఈ సినిమా జూన్ 5న విడుదల అయింది.ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి యావరేజ్ టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమా చూసిన చాలామంది నెటిజన్లు అసలు మణిరత్నం కి ఏమైంది..ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు చేస్తున్నారు.బొంబాయి,రోజా వంటి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ డైరెక్టర్ నుండి ఈ మధ్యకాలంలో కొన్ని వెరైటీ సినిమాలు వస్తున్నాయి అని సినిమాలు చూసిన నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పొన్నియన్  సెల్వన్ -1, పొన్నియన్ సెల్వన్ 2,నవాబు తాజాగా విడుదలైన థగ్ లైఫ్ ఈ సినిమాలన్నింటిలో ఎక్కువగా ఇల్లీగల్ అఫైర్స్ గురించే  మణిరత్నం చూపించారు.

 అయితే ఒకప్పుడు క్లాసిక్ సినిమాలకు పెట్టింది ఏంది పేరుగా ఉన్న మణిరత్నం ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్న సినిమాలను తీస్తున్నారేంటి అని కొంతమంది జనాలు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ఒక నెటిజన్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. బహుశా ఈ సినిమాలన్నీ చూస్తే నాకు ఒక్కటే అర్థం అవుతుంది. అదేంటంటే మణిరత్నం సార్ కి ఇల్లీగల్ ఎఫైర్ ఉందని నా అభిప్రాయం.. ఆ రిలేషన్ ని గుర్తించేందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అంటూ పోస్ట్ పెట్టాడు.

అయితే ఆ నెటిజన్ పెట్టిన పోస్ట్ కింద చాలా మంది నెటిజన్లు అవునవును మీరు పెట్టిన పోస్ట్ నిజమే అని ఈ పోస్ట్ చేసిన కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు క్లాసిక్ సినిమాలు తీసే మణిరత్నం లాంటి డైరెక్టర్ ఇలాంటి డీప్ లిప్ కిస్ లు పెట్టినప్పుడే ఇలాంటిదేదో మణిరత్నం సార్ కి ఉంటుందని అర్థం చేసుకోవాలి అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగిస్తున్నారు. కానీ మణిరత్నం అభిమానులు మాత్రం దిగ్గజ డైరెక్టర్ మీద ఇలాంటి పోస్ట్ పెట్టడం నిజంగా అవమానకరం అంటూ మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: