డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన ప్రేమ కథ చిత్రం ఆరెంజ్.. ఇందులో రామ్ చరణ్ కి మెయిన్ హీరోయిన్ గా జెనీలియా నటించింది. అంజన ప్రొడక్షన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నాగబాబు భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. ఇందులోని పాటలు ఆల్ టైం హిట్స్ గా నిలిచాయి.. అయితే అప్పట్లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఎందుకో ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దీంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది.  ఈ మధ్య మళ్లీ రీ రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్స్ కాబట్టినట్లు తెలుస్తోంది.

ఆరెంజ్ చిత్రంలో జెనీలియాతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రేయసిగా నటించిన షాజన్ పందసి (రూబా రూబా హే రూబా సాంగ్) ఈ పాట అప్పట్లో యూత్ ని బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది.షాజన్ పందసి ఉన్నది కొద్దిసేపు అయినా ఈ సినిమాకి బాగానే అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం ఒకే ఒక సినిమా మసాలా సినిమాలో మాత్రమే నటించింది. ఇందులో రామ్ కి జోడిగా నటించింది.



ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలలో నటించిన ఈ అమ్మడు అక్కడ బాగానే సక్సెస్ అయ్యింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో పాటుగా కొత్తవారు వస్తూ ఉండడంతో అవకాశాలు తగ్గిపోయాయి.. అలా అడపా దడపా చిత్రాలలో కనిపిస్తోంది. తాజాగా షాజన్ పందసి ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. గత ఏడాది నవంబర్లో  ఆశిష్ తనకు ప్రపోజ్ చేశారంటూ వెల్లడించింది. ఈ ఏడది జనవరిలో విరి ఎంగేజ్మెంట్ పూర్తి అవ్వగా తాజాగా నిన్నటి రోజున వివాహ బంధంతో ఒక్కటైనట్లుగా తెలియజేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్య పోయినప్పటికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: