పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా మొదలు అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఏ ఏం రత్నం నిర్మించాడు. ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు ఆగిపోతూ వచ్చింది. ఈ మూవీ దర్శకత్వ భాద్యతల నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొంత కాలం క్రితం ప్రకటించారు.

కానీ తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను జూన్ 12 వ తేదీన విడుదల చేయడం లేదు అని , మరో కొత్త తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తాం అని ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ ఈ మూవీ కి ఎంత బడ్జెట్ ఖర్చు అయ్యింది ..? అలాగే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజాగా జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ... హరిహర వీరమల్లు సినిమాకు 250 కోట్ల బడ్జెట్ ఖర్చు అయ్యింది అని చెప్పాడు. అలాగే ఈ మూవీ లో బందర్ పోర్టుకు సంబంధించిన ఒక సన్నివేశం ఉంటుంది అని , అక్కడ వచ్చే యాక్షన్ సన్నివేశం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.

అలాగే ఈ సినిమాలోని బందర్ పోర్టు సన్నివేశం గురించి రెండు సంవత్సరాలు కష్ట పడినట్లు కూడా జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కూడా హరిహర వీరమల్లు సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ ఎత్తున అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో అనే దానిపై పవన్ అభిమానుల్లో అత్యంత ఆసక్తి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: